మహేశ్వరం డిసెంబర్ 22: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ NTR నగర్ లో *ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన *సెమీ క్రిస్మస్ వేడుకల్లో* పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి మెంబర్ *దేప భాస్కర్ రెడ్డి రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు *చిలుక ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ. మీకు కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక *ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 👉ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రేమను, *కరుణను పంచడానికి జన్మించారు.* ఆయన బోధనలు కేవలం ఒక మతానికి పరిమితం కావు, అవి మానవాళి మొత్తానికి మార్గదర్శకాలు. 👉ద్వేషం ఉన్నచోట ప్రేమను, అశాంతి ఉన్నచోట శాంతిని నెలకొల్పడమే క్రిస్మస్ మనకు ఇచ్చే గొప్ప సందేశం.👉మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం నుంచి నేటి వరకు, క్రైస్తవ సోదరుల రక్షణకు, వారి సంక్షేమానికి మా పార్టీ పెద్దపీట వేసింది. 👉మన మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఈ పండుగ వేళ పేద కుటుంబాల్లో వెలుగులు నిండాలని నేను ఆశిస్తున్నాను. 👉ఈ పవిత్రమైన రోజున, మనమందరం కలిసి సమాజంలోని అసమానతలను తొలగించి, ఐకమత్యంతో ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ మీ అందరి జీవితాల్లో కొత్త ఆశలను, ఆయురారోగ్యాలను నింపాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
మహేశ్వరం డిసెంబర్ 21:మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన “కనుమల్ల మురళీమోహన్ మెమోరియల్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్” అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది. SR మీడియా వర్క్స్ మరియు సంజీవని సిస్టమ్స్ & సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందజేసి అభినందించారు. సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,> “యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతో దోహదపడతాయి. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను నిర్వహించడం అభినందనీయం. దివంగత కనుమల్ల మురళీమోహన్ జ్ఞాపకార్థం ఈ పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు నా అభినందనలు.” > కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, గట్ల రవీంద్ర,అల్కాపురి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు వంశీ,sv శ్రీనివాస్, డాక్టర్ కిరణ్,కనుమల్ల రాజు, జ్ఞానేశ్వర్ యాదవ్, హంస భాస్కర్, కోటయ్య మరియు పురుషులు సింగిలు విజేతలు: కె. శ్రీనివాస్,రన్నరప్,ఎం.ఎ. హకీమ్,3వ స్థానం ఎస్. ఆదిత్య,4వ స్థానం గురుచరణ్ తాంబే,5వ స్థానం పి. మహేష్ కుమార్,6వ స్థానం ఎస్.కె. మొహమ్మద్ ఈ7వ స్థానం మొహమ్మద్ అహ్మద్.8వస్థానం:ఎల్. సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
డిసెంబర్ 21 చారగొండ: డిసెంబర్ 17న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ నెంబర్ గా గెలిచిన రతన్ ఆంగోతు, తండ్రి ధర్మ మర్రిపల్లి గ్రామం. వార్డ్ నెంబర్ గా గెలిచిన తర్వాత రాజీనామా చేయడానికి కారణం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నానని తెలిపారు. తనకు రాజీనామా చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. తన రాజీనామా ఎంపీడీవో కార్యాలయానికి పత్రాన్ని పంపించారు. తన రాజీనామాను అంగీకరించవలసిందిగా కోరారు ఆంగోతు రతన్. గ్రామ సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానని చెప్పారూ ఆంగోతు రతన్.
Leave a Reply
డిసెంబర్ 20 హైదరాబాద్: బండారు దత్తాత్రేయ గారు మాజీ గవర్నర్ గారి ఆధ్వర్యంలో 20 డిసెంబర్, 2025 తేదీన HMDA పరిధిలో రైతుల సమస్యల పై చర్చా వేదిక హైదరాబాద్ ప్రెస్ క్లబ్, సోమాజిగూడ, హైదరాబాద్ నందు నిర్వహించడం జరిగింది. ఈ చర్చా వేదిక లో లోక్ సత్తా అధ్యక్షులు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ గారు, శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు, శ్రీ బూర నర్సయ్య గౌడ్ మాజీ పార్లమెంట్ సభ్యులు, పద్మశ్రీ చింతల వెంకట్ రెడ్డి ఆదర్శ రైతు, డాక్టర్ ఎస్. మల్లా రెడ్డి మాజీ సర్పంచ్ చర్చా వేదిక సంయోజకులు, శ్రీ కె.ఎస్.రత్నం మాజీ శాసన సభ్యులు, శ్రీమతి నిర్మల గోనెల విశ్రాంత ఐఏఎస్, శ్రీమతి కరుణ గోపాల్ ఫ్యుటరిస్టిక్ సిటీస్ వ్యవస్థాపకురాలు మరియు HMDA పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొనడం జరిగింది.
శ్రీ బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ గారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ :
• రాష్ట్ర ప్రభుత్వం HMDA మాస్టర్ ప్లాన్ లో అమాయక, పేద రైతులకు నష్టకరంగా జోన్ల నిర్ణయం తీసుకోవడం జరిగిందని, గత 11 సంవత్సరాలుగా జోన్లు మార్పులకు నోచుకోలేదని, రైతులకు అనుకూలంగా రెక్రీషనల్ జోన్ల నుండి ముల్తిప్లె జోన్ లకు మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం 7257 చ. కిమీ. విస్తీర్ణంతో 2013 లో మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, ప్రస్తుతం HMDA పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలలోని 70 మండలాలు, 24 మునిసిపాలిటీలు, 8 మునిసిపల్ కార్పొరేషన్లు, సుమారు 750 గ్రామాలు ఉన్నాయని, అయితే ఇటీవల 20 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లను GHMC లో విలీనం చేయడం జరిగిందని, మస్టర్ ప్లాన్ వల్ల ప్రణాళికా బద్దమైన అభివృద్ధి ఏమోగానీ రైతుల పాలిట మాత్రం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాస్టర్ ప్లాన్ లో భూములను కన్సర్వేషన్ (వ్యవసాయం) పబ్లిక్-సెమి పబ్లిక్, రిక్రియేషన్, ఓపెన్ స్పేస్, ట్రాఫిక్, రవాణా, పెరి-అర్బన్, రెసిడెన్సియల్ (నివాస), కమర్షియల్ (వాణిజ్య), ఇండస్ట్రియల్ (పారిశ్రామిక), మల్టిఫుల్ (బహుళ ప్రయోజన) తదితర జోన్లుగా విభజించడం జరిగిందని, పేద, అమాయక, సన్న, చిన్నకారు రైతుల భూములు ఇండ్ల నిర్మాణానికి కూడా అవకాశం లేని కన్సర్వేషన్ లాంటి జోన్లలో ఉన్నాయని, ఈ కారణంగా దాదాపు 50 వేల మంది రైతులు తమ భూములలో సొంత ఇల్లు కూడా నిర్మించుకునే పరిస్థితి లేదని, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులు, పలుకుబడి గల వారి భూములు ఎన్ని అంతస్తులైనా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉండే రెసిడెన్సియల్, ముల్టీపుల్ జోన్లలో ఉన్నాయని శ్రీ దత్తాత్రేయ గారు పేర్కొన్నారు.
పేదలు – ధనవంతుల మధ్య ఉండే అంతరం ఇక్కడే తెలుస్తుందని, వీరు వందల కోట్లకు పడగలెత్తుతుండగా పేదలు పేదవారుగానే మిగిలిపోతున్నారని, ఎకరా, రెండెకరాల భూమి ఉన్న రైతులు కూడా సొంత ఇండ్లకు దూరమవుతున్నారు. భూమి ఉన్నా కుటుంబం గడవని దయనీయ పరిస్థితి ఉందని, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలన్నింటిని మునిసిపాలిటీలుగా మార్చి GHMC లో విలీనం చేయడం జరిగిందని, ఈ పరిస్థితిలో రింగ్ రోడ్ లోపల ఉన్న భూములను కన్సర్వేషన్ / ఓపెన్ / రిక్రియేషన్ తదితర జోన్ల లో ఉంచడంలో అర్థమే లేదని, రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ను తక్షణమే మార్చి రైతులకు అనుకూలమైన రీతిలో రూపొందించాలని, గ్రోత్ కారిడార్ లో ప్రతిపాదించిన 100 అడుగుల వెడల్పు గల గ్రిడ్ రోడ్డు విషయం పై పునః పరిశీలన చేయాలి ప్రభుత్వాన్ని శ్రీ బండారు దత్తాత్రేయ గారు డిమాండ్ చేశారు.
డాక్టర్ ఎస్. మల్లా రెడ్డి మాజీ సర్పంచ్
చర్చా వేదిక సంయోజకులు
9440901313
Leave a Reply
డిసెంబర్ 20 సూర్యాపేట:
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్ లతో కలిసి రాష్ట్ర రవాణా, బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పి లు, రవాణా శాఖ, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అధికారులతో విడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పోలీస్, రవాణా, రెవిన్యూ, ఆర్ & బి, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయం చేసుకుంటూ జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని అలాగే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 26% మరణాలు, 9% ప్రమాదాలను తగ్గించడం జరిగిందని వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని శాఖలను సమన్వయము చేసుకుంటూ కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ మంత్రికి వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఇట్టి సమస్యను పరిష్కరించే దిశగా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వకూడదని అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు విద్యార్థులకు, యువకులు తెలియజేసేలా పాఠశాలలో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆర్టీసీ బస్సులు,లారీలు రోడ్డుపై ఆపకుండా ప్రక్కన ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ,పోలీస్,రెవెన్యూ, ఆర్ అండ్ బి, హెల్త్,ఇండస్ట్రియల్, పంచాయతీరాజ్ ఇంజనీర్, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ లాంటి శాఖలు తమ కార్యచరణ ప్రణాళికను వచ్చే సోమవారం నాటికి అందించాలని ఆదేశించారు.మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలలో, రెసిడెన్షియల్ స్కూల్స్లలో వ్యాచరచన పోటీలు,రోడ్ సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు చేయాలని అలాగే పిల్లలకు రోడ్లు ఏ విధంగా దాటాలో అవగాహన కల్పించాలని ఆర్టీసీ బస్టాండ్లలో వారంకు ఒక కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రత పై ప్రజలకు, డ్రైవర్లకు అవగాహన కల్పించాలని బైకు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని, షీట్ బెల్ట్ ధరించేలా ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేసే అధికారులు, అలాగే కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని,వారం రోజులు మాత్రమే గడువు ఇవ్వటం జరుగుతుందని తర్వాత ఎవరైనా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోతే వారి వాహనాలను కలెక్టరేట్లోకి అనుమతించేది లేదని హెచ్చరించారు.
మండల స్థాయి లో తహసీల్దార్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత ప్రమాదాలపై కమిటీ ఏర్పాటు చేసి బ్లాక్ స్పాట్స్ గుర్తించి సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.బ్లాక్ స్పాట్ ల దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారుల నుండి అనుసంధానం అయ్యే మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు,సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ అలాగే రవాణా శాఖ అధికారులు లారీ డ్రైవర్లతో, స్కూల్ బస్ డ్రైవర్లతో సమావేశం నిర్వహించి వాహనాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేలా చూడాలని అలాగే ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
డ్రైవర్లకు హెల్త్ క్యాంపు లు నిర్వహించి టి బి లాంటి అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం తోపాటు మందులు ఇవ్వాలని అన్నారు.
మున్సిపాలిటీలో స్కూల్ జోన్ లాంటి ప్రాంతాలలో ఆటోలు,రిక్షాలు, క్యాబ్ డ్రైవర్లకు నేమ్మిదిగా వెళ్లేలా మున్సిపల్ కమిషనర్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
సాండ్ టాక్సీ, మైనింగ్ వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉంటేనే రేడియం స్టికర్ అతికించాలని, పరిశ్రమలకు చెందిన వాహనాల డ్రైవర్లకు సరిపడే నిద్ర ఉండేలా డ్యూటీ లు ఇచ్చేవిధంగా యాజమాన్యం తో మాట్లాడితో చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకి గురైన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు 1.50 లక్షల రూపాయలు వారం రోజుల్లో సంబంధిత హాస్పిటల్ కు అందజేస్తుంది కాబట్టి రోడ్డు ప్రమాదాలలో క్షతగాత్రులకు వెంటనే చికిత్స చేయాలని హాస్పిటల్ యాజమాన్యులను కోరారు.
రాత్రి పూట పశువులు, కుక్కలు రోడ్లపై సంచరించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు తగ్గిన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
జాతీయ రహదారులపై ఏమైనా ప్రమాదాలు జరిగితే వారికి ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కు తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
చిన్న చిన్న భద్రత ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రాణాలను కాపాడినవారిమి అవుతామని ఇట్టి విషయాన్ని అధికారులు సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా ఎస్పీ కే నరసింహ, అదనపు కలెక్టర్ కె సీతారామారావు, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ ఈ సీతారామయ్య, పశుసంవర్ధన అధికారి శ్రీనివాసరావు, ఇండస్ట్రియల్ జిఎం సీతారాం,వెల్ఫేర్ అధికారులు శంకర్ నరసింహారావు వెల్ఫేర్ అధికారులు శంకర్, నరసింహారావు, దయానందరాణి, డీఈవో అశోక్ తదితరులు హాజరైనారు.
జారీ చేసిన వారు, జిల్లా పౌర సంబంధాల అధికారి, సూర్యాపేట
Leave a Reply
డిసెంబర్ 20 మహేశ్వరం:
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మరియు మహేశ్వరం మండలాలలో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ లను మరియు వారి యొక్క పాలకవర్గాన్ని ఈరోజు రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ గారు, మరియు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ లక్ష్యంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అవుతున్నారని దానికి నిదర్శనమే ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లలో భారతీయ జనతా పార్టీకి విశేష ఆదరణ లభించిందని అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లో ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని ఆదరించాలని…నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్న కందుకూరు మండలంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని తెలంగాణ రాష్ట్రంలో రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకట్ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్, మండల అధ్యక్షులు అంజి రెడ్డి, యాదిష్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Leave a Reply
డిసెంబర్ 20 శ్రీకాళహస్తి:విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఈ రోజు గ్రీన్ లీవ్స్ డే ను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులందరూ వివిధ రకాలైన పచ్చదనాన్ని పరిచే మొక్కల ఆకులతో అందంగా అలంకరించారు..హెర్బల్ ఆకులను, వాటి ఉపయోగాల గురించి పాఠశాల డైరెక్టర్ సుబ్బరామిరెడ్డి గారు, ప్రిన్సిపాల్ రామ్ ఉమా సింగ్ విద్యార్థులకు తెలియచేశారు.. అలోవెరా, రణపాల, యూకలిప్టస్ లాంటి ఆకులవలన రకరకాల ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు
Leave a Reply
డిసెంబర్ 19 మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు తమ వార్డు మెంబర్లతో కలిసి మండల అధ్యక్షులు నిమ్మ అంజి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారిని నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ మరియు పాలకవర్గాన్ని శ్రీరాములు గారు ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీరాములు గారు మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో అదే విధంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామంలోని చిట్టచివరి వ్యక్తి వరకు చేరేలా కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లకు సూచించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లోను ఇదే సత్తాను కొనసాగించి భారతీయ జనతా పార్టీకి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకట్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గానుగుపేట అంజమ్మ, ఆకులమైలారం సర్పంచ్ ఏ నరేష్, బేగంపేట్ సర్పంచ్ జాపాల పూజా హరిబాబు, దాసర్లపల్లి సర్పంచ్ టేకుమట్ల బాలరాజు, ఆకులమైలారం ఉప సర్పంచ్ అచ్చన్న సురేష్, వార్డు మెంబర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, బీజేవైఎం నాయకులు మరియు వివిధ గ్రామస్తులు పాల్గొన్నారు.
Leave a Reply
డిసెంబర్ 19 సూర్యాపేట: డిసెంబర్ 21 వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట డిఎస్పీ ప్రసన్నకుమార్ విజ్ఞప్తి చేశారు. జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉందని తెలిపారు. రాజీ చేసుకునే అవకాశమున్న వివిధ రకాల కేసులు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితం & కుటుంబ సమస్యలకు సంబంధించిన కేసులు, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం తదితర కేసులు పరిష్కరించుకోవచ్చు అని వివరించారు. కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు. న్యాయశాఖ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.
Leave a Reply
డిసెంబర్ 16 హైదరాబాద్: ది అపాయింట్మెంట్ కమిటీ అఫ్ జిపిఎఫ్ భారత-నేపాల్ దేశాల మధ్య డైరెక్టర్ & శాంతి రాయబారిగా డాక్టర్ రామ్ తిలక్ నియమితులయ్యారు. భారతదేశం మరియు నేపాల్ మధ్య వాణిజ్యం, సంస్కృతి, కళ మరియు సాహిత్యం కోసం డైరెక్టర్ & శాంతి రాయబారి కీలక పాత్రకు ప్రముఖ విద్యా మరియు సాంస్కృతిక ప్రతిపాదకుడు రామ్ తిలక్ నియమించినట్లు కమిటీ ప్రకటించడం గర్వంగా ఉంది.ఈ నియామకం కీలకమైన సమయంలో వచ్చింది, మెరుగైన ప్రజల మధ్య అనుసంధానం మరియు వ్యూహాత్మక సహకారం ద్వారా వారి ప్రత్యేకమైన, శతాబ్దాల నాటి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాల నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.దేశ భాగస్వామ్య శ్రేయస్సు మార్గాన్ని ఏర్పరచుకోవడం హిమాలయ సాంస్కృతిక వారసత్వంపై విస్తృతమైన పరిశోధనలకు, ద్వైపాక్షిక వేదికలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందిన డాక్టర్ రామ్ తిలక్, భారతదేశం-నేపాల్ సంబంధాలకు పునాది వేసే నాలుగు కీలక రంగాలలో కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. వాణిజ్యంః ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, జాయింట్ వెంచర్లను ప్రోత్సహించడానికి, పరస్పర ఆర్థిక ప్రయోజనం కోసం న్యాయమైన వాణిజ్య పద్ధతులను ప్రోత్సహించడానికి చర్చలు, సహకారాలను సులభతరం చేయడం. సంస్కృతి మరియు కళా రంగం లో రెండు దేశాల ఉమ్మడి వారసత్వం, మతపరమైన సారూప్యతలు మరియు విభిన్న కళాత్మక వ్యక్తీకరణలను జరుపుకోవడానికి ఉమ్మడి పండుగలు, ప్రదర్శనలు మరియు మార్పిడి కార్యక్రమాలను నిర్వహించడం.సాహిత్యంః భారతీయ మరియు నేపాలీ రచయితల మధ్య అనువాదం, ప్రచురణ మరియు సాహిత్య మార్పిడిని ప్రోత్సహించడం, ప్రతి దేశం యొక్క సమకాలీన మరియు సాంప్రదాయ కథనాలపై లోతైన అవగాహనను పెంపొందించడం.శాంతి రాయబారి గా సంభాషణల ద్వారా చిన్న చిన్న విభేదాలను పరిష్కరించడానికి, సద్భావనను ప్రోత్సహించడానికి మరియు భాగస్వామ్య ఆధ్యాత్మిక మరియు భౌగోళిక బంధాలు సంబంధంలో ప్రధానమైనవిగా ఉండేలా చూడటానికి ఒక వంతెనగా వ్యవహరించడం. డాక్టర్ రామ్ తిలక్ ఈ పాత్రకు అవసరమైన దౌత్య చతురత మరియు లోతైన సాంస్కృతిక అంతర్దృష్టి యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని కలిగి ఉన్నారు. మన ఉమ్మడి చారిత్రక, సాంస్కృతిక సామీప్యాన్ని ఆర్థిక, మేధో రంగాలలో స్పష్టమైన వృద్ధిగా మార్చడంలో ఆయన నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుంది “అని అన్నారు. ఈ పాత్రను పోషించడం గురించి డాక్టర్ రామ్ తిలక్ మాట్లాడుతూ, “ఈ బాధ్యతను స్వీకరించడం నాకు చాలా గౌరవంగా ఉంది. భారతదేశం మరియు నేపాల్ కేవలం పొరుగువారే కాదు; మనం ఒకే సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక నిర్మాణంతో ముడిపడి ఉన్నాము. వాణిజ్యం, కళ మరియు సాహిత్యం యొక్క దారాలను చురుకుగా పెంపొందించడం, మన పౌరులందరికీ శాశ్వతమైన శాంతి మరియు భాగస్వామ్య శ్రేయస్సు యొక్క వాతావరణాన్ని పెంపొందించడం నా లక్ష్యం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న కమ్యూనిటీలు, సంస్థలతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను “అని అన్నారు. డాక్టర్ రామ్ తిలక్ గౌరవనీయమైన సాంస్కృతిక కార్యకర్త, ఆర్థికవేత్త మరియు దక్షిణాసియా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించిన 10 సంవత్సరాల అనుభవం కలిగిన శాంతి రాయబారి. అతను మానవ హక్కులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉన్నాడు మరియు సరిహద్దు అవగాహనకు ఆయన చేసిన కృషికి ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ రత్న అవార్డు తో పాటుగా మరెన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.
మహేశ్వరం ప్రజలందరికీ అడ్వాన్స్ 🎄క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు దేప భాస్కర్ రెడ్డి టిపిసిసి సభ్యులు
అల్కాపురి కాలనీలో కమ్యూనిటీ హాల్ లోని కనుమల్ల మురళీమోహన్ మెమోరియల్’ క్యారమ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి
వార్డ్ నెంబర్ గా గెలిచి రాజీనామా చేశారు ఆంగోతు రతన్
బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్ గారి ఆధ్వర్యంలో HMDA పరిధిలో రైతుల సమస్యల పై చర్చా వేదిక నిర్వహించారు
రోడ్డు భద్రత ప్రమాణాలు పాటింటం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.